Nitish Kumar | దేశ చరిత్రను మార్చేందుకు కాషాయ పార్టీ కుట్ర : నితీష్ కుమార్
కాషాయ పాలకులు దేశ చరిత్రను మార్చాలని కోరుకుంటున్నారని బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) ఆరోపించారు.
న్యూఢిల్లీ : కాషాయ పాలకులు దేశ చరిత్రను మార్చాలని కోరుకుంటున్నారని బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) ఆరోపించారు. చరిత్రను తిరగరాయాలనే బీజేపీ కుయుక్తులను అడ్డుకునేందుకే తాను విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవని, ప్రతి ఒక్కరి బాగు కోసమే తాను పరితపిస్తానని చెప్పుకొచ్చారు.
తన కోసం తాను ఏమీ చేయడం లేదని బీహార్ సీఎం స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్‌ను మట్టికరిపించేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మార్పు ఖాయమని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇటీవల స్పష్టం చేశారు. గత పదేండ్లుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు.
కేంద్రంలో కాషాయ సర్కార్ చరిత్రను మార్చడం, ఎన్ఆర్సీ పేరుతో అన్యాయం చేయడం మినహా మోదీ సర్కార్ ప్రజల కోసం పాటుపడిందేమీ లేదని దీదీ దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ సర్కార్‌ను నిలువరించాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మట్టికరుస్తుందని అన్నారు. విపక్షాలు ఏకమైతే బీజేపీ ఓటమిపాలవుతుందని, విభజిత శక్తులపై భారత్ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు రేపుతున్న బీజేపీ కుయుక్తులను ఎండగడుతూ ప్రజలంతా ఏకం కావాలని దీదీ పిలుపు ఇచ్చారు.
Read More
BRS Bhavan | ఇదీ బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయ నేపథ్యం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Nitish Kumar
- Opposition
- unity
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

