బెంగళూరు: పరిమితికి మించి ప్రకటనలు వేయడమే కాక, నిర్దేశిత సమయంలో సినిమాను ప్రారంభించకుండా ప్రేక్షకులను విసిగించిన బెంగళూరులోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్‌కు వినియోగదారుల న్యాయస్థానం లక్ష రూపాయల జరిమానా విధించింది. ఇక నుంచి సినిమాను ప్రారంభించే కచ్చితమైన సమయాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని ఆదేశించింది.
కేసు వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నివాసి ఒకరు 2023 డిసెంబర్లో పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లో సినిమా చూడటానికి తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. సినిమాను 4.05 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా, సుదీర్ఘంగా ప్రకటనలు వేసి, విసిగించి 4.30కు ప్రారంభించారు. దీనిపై అతడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా, థియేటర్‌కు లక్ష జరిమానా విధించింది. ఫిర్యాదుదారుకు 20 వేలు, కోర్టు ఖర్చులకు 8 వేలు ఇవ్వాలని ఆదేశించింది.