బెంగుళూరు: తన భార్య లైంగికంగా చిత్రహింస పెడుతున్నట్లు ఓ భర్త ఫిర్యాదు చేశాడు. బెంగుళూరు(Bengaluru)కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఈ ఫిర్యాదు ఇచ్చాడు. అత్తింటి వాళ్లు తనను వేధిస్తున్నట్లు కూడా పేర్కొన్నాడె. దీంతో ఆ జంట మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్లు చెప్పాడు. నగర్‌భావి ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో అనేక విషయాలు చెప్పాడు. ఇంటికి వెళ్లనివ్వకుండా అత్త అడ్డుకున్నట్లు కూడా పేర్కొన్నాడు. కూతుర్ని వదిలేస్తే ఆమెకు మంచి భర్త దొరుకుతాడన్న ఉద్దేశంతో అత్త అలా ప్రవర్తించిందన్నాడు. మామ కృష్ణ మాదవ్ కూడా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించాడు.
భార్య తనను మానసిక క్షోభకు గురి చేసినట్లు ఫిర్యాదులో చెప్పాడు. ఆర్థిక స్థితిని కించపరుస్తూ తన పట్ల నిరుత్సాహాన్ని వ్యక్తం చేసేదన్నారు. సంపన్ను స్నేహితులతో తన భార్య క్కువ సమయం గడిపేదన్నారు. తరుచూ పార్టీలు, తాగుడుకే అంకితమైనట్లు పేర్కొన్నాడు. తన భార్య లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపాడు. లైంగికంగా చిత్రహింస పెట్టేదని, అసభ్యకర వీడియోలు పంపేదని, అలా చేయాలని వత్తిడి చేసేదని, ఆమె స్నేహితులతో కలిసి శృంగారం చేసే విధంగా బలవంతం చేసిందని ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మాజీ బాయ్ప్రెండ్లతో తన భార్యకు శారీరక సంబంధాలు ఉన్నట్లు తెలిపాడు.
భార్యాభర్తల మధ్య కలహాలను పరిష్కరించేందుకు 2024 జూలై 4వ తేదీన రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. కానీ వాళ్లు సమస్య తీరులేదు. బాధిత వ్యక్తిని ఇంటి నుంచి గెంటివేశారు. భార్య చెన్నైకి వెళ్లిపోయినట్లు ఆ వ్యక్తి తన ఫిర్యాదులో తెలిపాడు. కేవలం ల్యాప్‌టాప్, యూనిఫామ్ తో బయటకు వచ్చినట్లు పేర్కొన్నాడు. 1.87 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను తన భార్య తీసుకెళ్లినట్లు చెప్పాడు. తన ల్యాప్‌టాప్‌లో ఉన్న వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసినట్లు ఆరోపించాడు. పెళ్లి సమయంలో భార్యకు ఇచ్చిన వెండి ప్లేట్లు, దీపాంతలను అప్పగించాలని చెప్పాడు. వాటిని రికవరీ చేసేందుకు సహకరించాలని అతను కోరాడు.
భార్య కూడా భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తమిళనాడులో ప్రత్యేకంగా కేసు నమోదు చేసింది.