కోల్కతా: ఒక వ్యక్తి తన వదిన తల నరికాడు. తెగిన తలను ఒక చేతిలో, మరో చేతిలోని కత్తితో రోడ్డుపై తిరిగాడు. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. చివరకు అతడు పోలీసులకు లొంగిపోయాడు. (Bengal Man Beheads Woman) పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం బసంతికి చెందిన బిమల్ మండల్, అన్న భార్య సతి మండల్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు కత్తితో వదిన తల నరికాడు. తెగిన ఆమె తలను చేతపట్టుకుని రోడ్డుపై నడిచాడు. ఇన్నేళ్లుగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అరిచాడు.
కాగా, ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తెగిన వదిన తలతో రోడ్డుపై నడిచి వెళ్తున్న బిమల్ను చూసి స్థానికులు భయాందోళన చెందారు. కొందరు బైకులపై, కాలి నడకన అతడ్ని అనుసరించారు. చివరకు బసంతి పోలీస్ స్టేషన్లో అతడు లొంగిపోయాడు. కుటుంబ కలహాల వల్ల అన్న భార్యను బిమల్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: