UP CM : పశ్చిమబెంగాల్ సీఎం (West Bengal CM) మమతా బెనర్జి (Mamata Banerjee) పై ఉత్తరప్రదేశ్ సీఎం (Uttarpradesh CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. మమత తనకు ఏమీ పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్ మంటల్లో మండిపోతుంటే.. సీఎం మౌనంగా ఉన్నారని అన్నారు.
లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను సృష్టించేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చోద్యం చూస్తున్నారని యూపీ సీఎం ఫైరయ్యారు. ఇలాంటి అరాచకాలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందని అన్నారు. నిరసనకారులను ఆమె శాంతిదూతలుగా భావిస్తారని.. కానీ హింసకు అలవాటుపడితే వారు ఆమె మాటలను కూడా లెక్క చేయరని హెచ్చరించారు.
ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాదీ నేతలు బెంగాల్లో ఇంత విధ్వంసం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి బెంగాల్‌కు భద్రతా దళాలను పంపిన కేంద్ర ప్రభుత్వానికి యోగి కృతజ్ఞతలు తెలిపారు.