ముంబై: బంగ్లాదేశీ పోర్న్ నటి(Bangladeshi Actor ) రియా బర్డీని ముంబై సమీపంలో అరెస్టు చేశారు. ఉల్లాస్నగర్లోని హిల్లైన్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఇండియా పాస్పోర్టుతో ఉంటున్నట్లు గుర్తించారు. అంబర్నాథ్ ప్రాంతంలో ఓ బంగ్లాదేశీ కుటుంబం నకిలీ డాక్యుమెంట్లతో జీవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆ కుటుంబం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమరావతిలో ఉన్న ఓ వ్యక్తి .. రియా డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఆమెతో పాటు మరో ముగ్గురి డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేశారు.హిల్ లైన్ పోలీసులు రియాపై కేసు రిజిస్టర్ చేశారు. నిందితురాలి పేరెంట్స్ ప్రస్తుతం ఖతార్లో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.