Bangla MP murder case | బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. సెప్టిక్ ట్యాంకులో 3.50 కిలోల మాంసం ముద్దలు..!
Bangla MP murder case | బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. కోల్‌కతాలో జరిగిన ఈ హత్య కేసులో దర్యాప్తు అధికారులు కొంత పురోగతి సాధించారు. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్మెంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో బెంగాల్ సీఐడీ దర్యాప్తు బృందాలు తాజాగా మాంసపు ముద్దలను గుర్తించాయి.
Bangla MP murder case : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. కోల్‌కతాలో జరిగిన ఈ హత్య కేసులో దర్యాప్తు అధికారులు కొంత పురోగతి సాధించారు. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్మెంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో బెంగాల్ సీఐడీ దర్యాప్తు బృందాలు తాజాగా మాంసపు ముద్దలను గుర్తించాయి.
మొత్తం మూడున్నర కిలోల మాంసం ముద్దలు, కొన్ని వెంట్రుకలు సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యమైనట్లు ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని, డీఎన్ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు అనర్‌కు చెందినవో కావో తెలుస్తుందని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయన హత్యకు గురైన ఫ్లాట్‌లోని బాత్రూమ్ ద్వారా రక్తం మురుగునీటి పైపులగుండా వెళ్లినట్లు భావించామని పోలీసు అధికారి తెలిపారు. హౌసింగ్ కాంప్లెక్స్ బాధ్యుల సహాయంతో ఆ మురుగునీటి పైపులైన్లు, సెప్టిక్ ట్యాంకును పరిశీలించామని, ఈ క్రమంలోనే మాంసపు ముద్దలను గుర్తించామని చెప్పారు.
బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ వైద్య చికిత్స కోసం ఈ నెల 12న కోల్‌కతా వచ్చారు. తన స్నేహితుడికి చెందిన అపార్ట్మెంట్లో బస చేసిన ఆయన.. కొన్నిరోజుల తర్వాత కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ సహాయంతో నిందితులు ఆయనను హనీట్రాప్‌లోకి దింపి, ఆయన బస చేసిన అపార్ట్మెంట్లోనే గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
నిందితుడు వృత్తిరీత్యా కసాయి అని, ఎంపీని హత్య చేసిన అనంతరం శరీరాన్ని 80 ముక్కలుగా చేసి, వాటికి పసుపు కలిపి నగరంలోని బాగ్జోలా కాలువ, ఇతర ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఆయన శరీర భాగాల కోసం పోలీసులు ముమ్మరవేట ప్రారంభించారు. అయితే వాటిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఇటీవల వర్షాలు కురవడంతో శరీర భాగాలు కొట్టుకొనిపోయి ఉంటాయని, జంతువులు కూడా వాటిని తినే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కూడా కోల్‌కతాలో దర్యాప్తు చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kancherla Bhupal Reddy | కంచర్ల భూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. చిట్యాలలో ఉద్రిక్తత
Meenakshi chaudhary | “నాకు క్రష్ లేదు.. నా జీవితమే క్రష్ అయిపోయింది”.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
Anirudh-Kavya Maran | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు అయిందా.. షాక్‌లో సినీ ప్రియులు
Tollywood | బాక్సాఫీస్ వద్ద రెండు మంచి సినిమాలు.. ‘ENE రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

