Balbir singh | పంజాబ్లో బల్బీర్ సింగ్ మంత్రిగా ప్రమాణం.. ఆరోగ్య శాఖ కేటాయింపు
Balbir singh | పంజాబ్లో కొత్త మంత్రిగా బల్బీర్ సింగ్ ప్రమాణం స్వీకరించారు. విజయ్ సింగ్లా, ఫౌజ్ సింగ్ సరారీ రాజీనామాతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో బల్బీర్ సింగ్ను ప్రభుత్వం మంత్రిగా నియమించింది. ఆయనకు ఆరోగ్య శాఖ కేటాయించారు.
Balbir singh | పంజాబ్లో బల్బీర్ సింగ్ మంత్రిగా ప్రమాణం స్వీకరించారు. బల్బీర్ సింగ్తో గవర్నర్ కొంతసేపటి క్రితం ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనకు ముఖ్యమంత్రి భతవంత్ సింగ్ ఆరోగ్య శాఖను కేటాయించారు. అవినీతి ఆరోపణలపై మంత్రి పదవికి ఫౌజా సింగ్ సరారీ రాజీనామా చేశారు. అంతకుముందు కూడా అవినీతి ఆరోపణలతో ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను కూడా మంత్రి పదవి నుంచి ప్రభుత్వం తప్పించింది.
పంజాబ్లో ఆప్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం విశేషం. డిపార్ట్మెంట్ టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని డాక్టర్ విజయ్ సింగ్లాపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన రాజీనామా చేయాల్సివచ్చింది. అదేవిధంగా తన పీఏతో అవినీతిపై మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫౌజ్ సింగ్ సరారీ ఇవాళ రాజీనామా చేశారు. రెండు మంత్రి పదవులు ఖాళీ అవడంతో బల్బీర్సింగ్ను మంత్రిగా తీసుకుని ఆయనకు ఆరోగ్య శాఖను అప్పగించారు. చేతన్సింగ్ నుంచి ఆరోగ్య శాఖను, హర్జోత్ బెయిన్స్ నుంచి జైళ్ల శాఖను ఉపసంహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

