బద్రీనాథ్ రోడ్డు మూసివేత.. చార్ధామ్ యాత్రకు ఆటంకం..
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్ హైవేపై పడిపోయాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన్ని మూసివేశామని, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. బద్రీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకారం.. ఈ ఏడాది 7.60లక్షల మంది పర్యాటకులు బద్రీనాథ్‌ను సందర్శించారు. మే 8న బద్రీనాథ్ యాత్ర ప్రారంభమైంది. రోడ్డు మూతపడడంతో యాత్రకు ఆటంకం కలుగుతున్నది. పలు ప్రాంతాల్లో భక్తులు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తున్నది.
ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి బద్రీనాథ్‌ను సందర్శించి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల్లో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అరైవల్ ప్లాజా నిర్మాణం, దేవాలయం సమీపంలోని సరస్సుల సుందరీకరణ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ద్వారా లూప్ రోడ్, బైపాస్ నిర్మాణాలున్నాయి. పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
उत्तराखंड : रात भर हुई बारिश के बाद बिरही और पागलनाले में बोल्डर गिरने के कारण बद्रीनाथ राजमार्ग अवरुद्ध हो गया है। बहाली का काम चल रहा है। pic.twitter.com/RUVpAChCom
— ANI_HindiNews (@AHindinews) June 26, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

