మోదీకి బెంగాలీలపై నమ్మకం లేదు.. ప్రధానిపై సుప్రియో తొలిసారి ఫైర్

కోల్‌కతా: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, తొలిసారి ప్రధాని మోదీ లక్ష్యంగా మాటల దాడి చేశారు. ఢిల్లీ నుంచి హౌరాకు వచ్చిన ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. బెంగాలీలపై మోదీకి నమ్మకం లేదని, అందుకే బెంగాల్ ప్రజలతో సామరస్యపూర్వక సంబంధాన్ని ఆయన గుర్తించలేకపోయారని బాబుల్ సుప్రియో విమర్శించారు. ‘నేను ఢిల్లీలో ఉన్న ఏడెనిమిది ఏండ్ల కాలంలో ఒక విషయాన్ని గ్రహించాను. ప్రధాని మోదీకి బెంగాలీలపై విశ్వాసం లేదు. అందుకే సామరస్యాన్ని నెలకొల్పలేకపోతున్నారని నాకు తెలిసింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
బెంగాల్లో గెలిచిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరినా వారిని ఆ పార్టీ నమ్మడం లేదని, ఎక్కడో సామరస్య లోటు ఉన్నదని బాబుల్ సుప్రియో ఆరోపించారు. అందుకే తానే గాక, కాంగ్రెస్‌కు చెందిన బెంగాల్ సీనియర్ నేత సుందర్ జిత్ సింగ్ కూడా బీజేపీని వీడిన సంగతిని గుర్తు చేశారు. సీఎం దీదీ నాయకత్వంలో పనిచేయడానికి, బెంగాల్ ప్రజలకు సేవ చేయడానికి తాను టీఎంసీలో చేరానని వివరించారు.
కాగా, సీఎం మమతా బెనర్జీ పోటీ చేసే భవానీపూర్‌తో పాటు మరో రెండు స్థానాల్లో గురువారం ఉప ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి ఒక రోజు ముందు బీజేపీని వీడి ఇటీవల టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో తొలిసారి ప్రధాని మోదీ లక్ష్యంగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు ఎంపీ అయిన ఆయన ఢిల్లీలోని అధికార నివాసాన్ని ఖాళీ చేసి కుటుంబంతో సహా బెంగాల్‌లోని హౌరాకు చేరారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ఇటీవల ఆయన ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

