న్యూఢిల్లీ: మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఏడాదే రాబోతున్నదా? అంటే బాబా వంగ జోస్యం అవుననే చెప్తున్నది. ఆమె చెప్పినట్టుగానే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తొలి అడుగై సాగుతున్నది. ఇదొక్కటే కాదు బాబా వంగ ప్రకారం ప్రపంచం 2023లో ఘోరమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశమున్నది. నమ్మాలా? అంటే ఆమెచెప్పిన వాటిలో 85% జరిగాయి. అందుకే, ఆమె జోస్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయటం లేదు. వచ్చే ఏడాది సౌర సునామీ దాడి చేస్తుందని, దాంతో భూమి అయస్కాంత క్షేత్రం తీవ్రంగా దెబ్బతింటుందని ఆమె చెప్పారు. ఏలియన్లు భూమిపై దాడి చేస్తాయని, దాంతో ప్రపంచమంతా చీకటి అలుముకుంటుందని, లక్షల మంది మరణిస్తారని తెలిపారు. ఆసియాలో అణు విస్ఫోటం జరిగి, తీవ్ర వ్యాధుల బారిన పడతారని వివరించారు.