Baba Ramdev | మేడమ్ టుస్సాడ్స్‌లో బాబా రాందేవ్ మైనపు బొమ్మ.. గర్వంగా ఉందన్న యోగా గురువు..!
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మైనపు బొమ్మను న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖుల మైనపు బొమ్మలు సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మైనపు బొమ్మను న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖుల మైనపు బొమ్మలు సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, నటులు సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు, ప్రభాస్‌తో పాటు మరికొందరి మైనపు బొమ్మలున్నాయి. తాజాగా యోగా గురు బాబా రాందేవ్‌కు సైతం గౌరవం దక్కింది.
వృక్షాసన ముద్రలో రామ్‌దేవ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాందేవ్ బాబా యోగాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. భారతీయ యోగా, పురాతన ఆయుర్వేద చికిత్సల ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అన్ని వయసుల వ్యక్తులను ఆయన ప్రభావితం చేశారు. యోగాతో పాటు ఆయుర్వేదం, వ్యాపారంలో సైతం రాణిస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్ న్యూయార్క్ తరపున ప్రతినిధి టియాగో మొగోడౌరో మాట్లాడుతూ బాబా రామ్‌దేవ్ మైనపు బొమ్మను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.
యోగాను ప్రోత్సహించడం, ఆయుర్వేద సంస్కృతిని పరిచయం చేయడం, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం పాటుపడుతున్నారన్నారు. యోగాకు చేసిన సేవలకు ఆయనను గౌరవించినందుకు గర్వపడుతున్నామన్నారు. బాబా రాందేవ్ మాట్లాడుతూ మైనపు బొమ్మను ఆవిష్కరించడం తనకు లభించిన గొప్ప గౌరవమన్నారు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా యోగా, ఆయుర్వేదం ప్రపంచ ప్రభావానికి ఇది ఒక ముఖ్యమైన గుర్తింపుగా తాను భావిస్తున్నానన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

