Yamunotri Dham | కేదార్నాథ్ హిమపాతం.. గంగోత్రికి వెళ్తూ హైదరాబాద్ వాసి మృతి
Yamunotri Dham | ఉత్తరాఖండ్‌లోని నీలకంఠ పర్వాతాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంచుజారిపడింది. ఇటీవల భారీగా మంచువర్షం కురుస్తుండడంతో కొండలన్నీ మంచుతో పరుచుకున్నాయి. ఈ క్రమంలో రిషిగంగ వద్ద కొండలపై నుంచి ఉన్నట్టుండి మంచు జారిపడింది.
Yamunotri Dham | ఉత్తరాఖండ్‌లోని నీలకంఠ పర్వాతాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంచుజారిపడింది. ఇటీవల భారీగా మంచువర్షం కురుస్తుండడంతో కొండలన్నీ మంచుతో పరుచుకున్నాయి. ఈ క్రమంలో రిషిగంగ వద్ద కొండలపై నుంచి ఉన్నట్టుండి మంచు జారిపడింది. మరో వైపు యమునోత్రి ధామ్ సహా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. యమునోత్రి ధామ్ సందర్శించి.. గంగోత్రికి వెళ్తున్న సమయంలో బండరాయి తగిలి తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబీకులు బార్కోట్ సీహెచ్‌సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
మృతురాలిని ఏపీకి చెందిన సరోజ (46)గా గుర్తించారు. ఆమె హైదరాబాద్‌లోని అల్కాపురిలో నివాసం ఉంటున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. మృతులు బంధువులతో కలిసి శుక్రవారం యమునోత్రిలో దర్శనం చేసుకున్నారు. ఖరాడి పట్టణంలో ఓ హోటల్లో బస చేసి శనివారం ఉదయం గంగోత్రికి ఓ
వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో కొండ వద్ద నుంచి వెళ్తుండగా.. బండరాయి వచ్చి తలపై పడింది. దాంతో కుటుంబీకులు వెంటనే సరోజను బార్కోట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు నవోగావ్ను పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

