Shiv Shakti: ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తిగా నామకరణం
National Space Day: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తిగా నామకరణం చేశారు. ఇక చంద్రయాన్-2 ప్రాంతానికి తిరంగాగా పేరు పెట్టారు. ఆగస్టు 23వ తేదీని ఇక నుంచి నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. చంద్రయాన్-3 సక్సెస్ నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగళూరులో ఇవాళ ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించారు.
బెంగుళూరు: చంద్రయాన్-3 మిషన్‌ను అత్యంత విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవం(National Space Day)గా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి(Shiv Shakti)గా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌లో శాస్త్రవేత్తలను మోదీ కలిశారు. చంద్రుడిపై చంద్రయాన్-2 జ్ఞాపకాలను వదిలి వెళ్లిన ప్రాంతాన్ని తిరంగాగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ సాగించిన ప్రతి ప్రయత్నానికి ఇస్రో స్పూర్తిగా నిలుస్తుందన్నారు. విఫలమనేది అన్నింటికీ అంతం కాదు అన్న సత్యాన్ని గుర్తు చేస్తుందన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/IO3YxuV4JE
— ANI (@ANI) August 26, 2023
చంద్రయాన్-3లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. భవిష్యత్తు తరాల ప్రజలు ఆ శివశక్తి ప్రదేశాన్ని తమకు ప్రేరణగా తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సంక్షేమమే తమ నిబద్దత అని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

