India Post | న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత, బ్యాంకు సంబంధిత వివరాల డాటా చోరీకి సైబర్ నేరగాళ్లు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందులో భాగంగా ‘ఇండియా పోస్టు’ పేరుతో ఎస్ఎంఎస్ పంపుతూ తాజాగా మరో మోసానికి తెరలేపారు. మీ ప్యాకేజీ వేర్‌హౌస్‌కు వచ్చిందని, డెలివరీ చేసేందుకు 48 గంటల్లోగా పూర్తి చిరునామా వివరాలు ఇవ్వాలని, లేకుంటే పార్సిల్ వెనక్కు వెళ్లిపోతుందని ఒక లింక్ పంపుతున్నారు.
అయితే దీనిపై ప్రెస్ ఇన్మర్మేషన్ బ్యూరో(పీఐబీ) పౌరులకు హెచ్చరికలు చేసింది. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతుందనిమీ ఫోన్ యాక్సెస్ పొందుతారని పేర్కొన్నది. ఇండియా పోస్టు అలాంటి సందేశాలు, లింకులు పంపదని పీఐబీ స్పష్టం చేసింది.