ఇంఫాల్ : మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సెక్యూరిటీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మిలిటెంట్ల దాడిలో కాన్వాయ్‌లోని ఓ వాహనం డ్రైవర్ కుడి భుజానికి బుల్లెట్ గాయమైంది. ఇటీవల హింస చెలరేగిన జిర్బామ్ జిల్లాలో సీఎం మంగళవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా కాన్వాయ్ వెళ్తుండగా కొట్లెన్ గ్రామానికి సమీపంలో మిలిటెంట్లు దాడికి దిగారు. కాన్వాయ్‌లోని వాహనాలపై పలుమార్లు కాల్పులు జరిపారని, భద్రతా బలగాలు మిలిటెంట్ల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టు చెప్పారు.