న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో వాయుసేన వాహనశ్రేణిపై శనివారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూంఛ్ జిల్లా సురాన్కోట్లో జరిగిన ఈ దాడిలో ఓ సైనికుడు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అయితే ఇది ఉగ్రదాడి కాదని, లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన స్టంట్ అని చన్నీ ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రజల ప్రాణాలు, దేహాలతో బీజేపీ ఆటలాడుతున్నదని విమర్శించారు.