ATM Charges | నేటి నుంచి ఏటీఎం చార్జీల పెంపు.. పరిమితికి మించితే వాతే!
ఈ నెల 1 నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ రుసుములు పెరుగుతాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినందు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. 11 రాష్ర్టాల్లో బ్యాంకుల విలీనం ప్రభావం పడుతుంది.
- వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు స్లీపర్, ఏసీ బోగీల్లోకి అనుమతి ఉండదు
- నేటి నుంచి వచ్చే మార్పులివే
ATM Charges | న్యూఢిల్లీ : ఈ నెల 1 నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ రుసుములు పెరుగుతాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినందు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. 11 రాష్ర్టాల్లో బ్యాంకుల విలీనం ప్రభావం పడుతుంది.
ఏటీఎం ఫీజు
ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజును మే 1 నుంచి పెంచడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, బ్యాలన్స్ చెక్, పిన్ ఛేంజ్ వంటి లావాదేవీలకు నెలవారీ పరిమితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిమితికి మించిన ప్రతి లావాదేవీకి ప్రస్తుతం రూ.21 వసూలు చేస్తున్నారు. దీనిని మే 1 నుంచి రూ.23కు పెంచారు.
రైల్వే టికెట్లు
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లతో ప్రయాణికులు మే 1 నుంచి స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించరాదని భారతీయ రైల్వే ప్రకటించింది. వీరు జనరల్ బోగీల్లో ప్రయాణించవచ్చునని చెప్పింది. క్యాన్సిలేషన్ రిఫండ్ సమయాన్ని 2 రోజులకు తగ్గించింది.
ఆదాయపు పన్ను రిటర్నులు
ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్ 30న ఐటీఆర్ ఫారం 1, 4లను విడుదల చేసింది. సంవత్సరానికి రూ.50 లక్షల కన్నా తక్కువ ఆదాయం గల వ్యక్తులు, సంస్థలు తమ ఐటీ రిటర్నులను మే నెలలో దాఖలు చేయవచ్చు.
బ్యాంకుల విలీనం
‘ఒక రాష్ట్రం-ఒకే ఆర్ఆర్బీ’ విధానం మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. 11 రాష్ర్టాల్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ‘ఒక రాష్ర్టానికి ఒకే ఆర్ఆర్బీ’గా విలీనమవుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

