Assam Assembly | యునిఫాం సివిల్ కోడ్ బిల్లు పాస్ చేసిన అసోం అసెంబ్లీ.. ప్రతిపక్షాల నిరసనల మధ్య బిల్లు ఆమోదం
Assam Assembly : వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన యునిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును అసోం అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య బిల్లు బుధవారం ఆమోదం పొందింది. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పొలిటికల్ ఎజెండా బిల్లుగా పేర్కొన్నాయి.
Assam Assembly : వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన యునిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును అసోం అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య బిల్లు బుధవారం ఆమోదం పొందింది. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పొలిటికల్ ఎజెండా బిల్లుగా పేర్కొన్నాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ బిల్లును విస్తృత సంప్రదింపుల కోసం ఎంపిక చేసిన కమిటీకి పంపాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ బిల్లు అమలైతే.. యూసీసీని అమలు చేస్తున్న మూడో రాష్ట్రంగా అసోం నిలవనుంది. ఇంతకుముందు ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు యూసీసీని ఆమోదించి అమలు చేస్తున్నాయి. అసోంలో ఐదు రోజుల ప్రత్యేక అసెంబ్లీని హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా సోమవారం యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. బుధవారం ఆమోదం పొందింది. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ ఇకపై బహుభార్యత్వం కలిగి ఉండటానికి వీల్లేకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. మత ప్రాతిపదికన కాకుండా అందరికీ ఇదే చట్టం వర్తిస్తుంది. అయితే, అసోంలోని గిరిజన తెగలకు మాత్రం ఈ బిల్లు వర్తించదు.
ఈ బిల్లు ప్రకారం ఎవరైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఇకపై నేరమే. దీని ప్రకారం గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, ఎవరైనా, ఎవరితోనైనా సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్) చేస్తే ఆ బంధాన్ని రిజిష్టర్ చేసుకోవాలి. లేకుంటే సంబంధిత వ్యక్తులకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఈ బిల్లు ప్రకారం పురుషుల వివాహ వయస్సు 21 సంవత్సరాలు, యువతుల వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ బిల్లు ద్వారా పెళ్లి, విడాకులు, సహజీవనం, వారసత్వ హక్కులపై చట్టబద్ధత లభిస్తుందని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.
అసోం సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ బిల్లు మతపరమైన వివాహ సంప్రదాయాలకు, ఆచారాలకు రక్షణ కల్పిస్తుందని సీఎం అన్నారు. అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీఎంసీ, ఆర్డీపీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుకు సంబంధించిన వారికి చెందిన అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే దీన్ని ఆమోదించడం సరికాదని ప్రతిపక్షాలు అంటున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

