గువాహటి : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై అస్సాం సివిల్ సర్వీసెస్ అధికారిణి నుపుర్ బోరాను సోమవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సీఎం ప్రత్యేక నిఘా విభాగ అధికారులు గువాహటిలోని ఆమె ఇంట్లో సోదాలు చేసి రూ.92 లక్షల నగదు, రూ.1 కోటి విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు.
మరో రూ.10 లక్షలను సోదాలు కొనసాగుతున్న బర్పెటాలోని ఆమె అద్దె ఇంట్లో రికవరీ చేశారు. బోరా కామర్పూర్ జిల్లాలో సర్కిల్ అధికారిణిగా పని చేస్తున్నారు. వివాదాస్పద భూముల వ్యవహరాల్లో ఆమె ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్టు అస్సాం సీఎం తెలిపారు.