Assam government | ఆ రెండు రోజులూ తల్లిదండ్రులతో గడపండి.. ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం ప్రత్యేక సెలవులు
Assam government | నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు (employees) అస్సాం ప్రభుత్వం (Assam government) ప్రత్యేక సాధారణ సెలవులు (special casual leave) ప్రకటించింది.
Assam government | నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు (employees) అస్సాం ప్రభుత్వం (Assam government) ఏటా ఏదో ఒక నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవులు (special casual leave) ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ రెండు రోజులూ ఒత్తిడిని పక్కన పెట్టి తల్లిదండ్రులు, అత్తమామలతో సమయం గడిపేందుకు ఈ వీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవులు ప్రకటించింది.
నవంబర్ 6, 8 తేదీల్లో ఉద్యోగులు ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో సమయం గడిపేందుకు హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం రెండు రోజులు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. నవంబర్ 6, 8వ తేదీల్లో ఈ సెలవులను ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు’ అని పేర్కొంది. అయితే, 7వ తేదీ ఛత్ పూజ , 9వ తేదీ రెండో శనివారం కావడంతో ఉద్యోగులకు మొత్తం నాలుగు రోజులు కలిసొచ్చిందని పేర్కొంది.
ఈ సెలవులు వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత ఆనందం కోసం మాత్రం ఉపయోగించుకోకూడదని హిమంత ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం తల్లిదండ్రులు, అత్తమామలతో సమయం గడిపేందుకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించింది. వారిని గౌరవించి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొంది. తల్లిదండ్రులు, అత్తమామలు లేని ఉద్యోగులు ఈ సెలవులకు అర్హులు కాదని తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Also Read..
Mamata Banerjee | అనంత్ అంబానీ పెళ్లికి బెంగాల్ సీఎం.. మహారాష్ట్ర నేతలతో దీదీ భేటీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

