Assam | ఏఎఫ్ఎస్పీఏ చట్టం రద్దు విషయంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ చట్టం రద్దు విషయంలో మరో 45 రోజుల్లో సానుకూల నిర్ణయం వచ్చే ఛాన్స్ ఉందని వ్యాఖ్యానించారు. ట్రైబల్ మిలిటెన్సీ ముగిసింది కాబట్టి, ఈ విషయంలో తమ ప్రభుత్వం కూడా ఓ ఆచరణాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు. అటు ప్రధాని మోదీ, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్షా కూడా ఈ చట్టం రద్దు విషయంలో సానుకూలంగానే ఉన్నారని, దీనిపై ఓ కమిటీని కూడా వేశారని ఆయన గుర్తు చేశారు. ఇలా ఓ కమిటీని ఏర్పాటు చేయడం సానుకూల సంకేతమేనని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో అనేక వివాదాస్పద సమస్యలున్నాయని, ప్రధాని మోదీ వాటిని పరిష్కరించే దిశగానే అడుగులు వేస్తున్నారని హిమంత బిశ్వశర్మ అన్నారు.