సీఎం భగవంత్ మాన్‌ను చూసి గర్వపడుతున్నా : సీఎం కేజ్రీవాల్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిపుచ్చగలరని, కానీ అలా చేయలేదన్నారు. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
”భగవంత్ మాన్…. తమర్ని చూసి ఎంతో గర్విస్తున్నా.. మీ చర్యతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమ్ఆద్మీని చూసి దేశం మొత్తం గర్విస్తోంది. ఈ అవినీతి గురించి ఎవ్వరికీ ఉప్పందలేదు. అటు మీడియాకు గానీ, ఇటు విపక్షానికి గానీ అస్సలు సమాచారమే లేదు. భగవంత్ మాన్ తలుచుకుంటే ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చేవారే కాదు. మంత్రి అవినీతిలో భాగం కావాలనేవారు. కానీ… సీఎం అలా చేయలేదు. మంత్రిపై చర్యలు తీసుకున్నారు ” అంటూ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను అవినీతి నిరోధక శాఖ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించడంతో… ఏసీబీ వెంటనే విజయ్ సింఘాల్‌ను అరెస్ట్ చేసింది.
ఈ విషయంపై సీఎం భగవంత్ మాన్ స్పందించారు. మంత్రి విజయ్ సింఘాల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించాను. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశా. తన శాఖలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి పాల్పడినట్లు ఆయన అంగీకరించారు కూడా. తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదు అని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు.
Proud of you Bhagwant. Ur action has brought tears to my eyes.
Whole nation today feels proud of AAP https://t.co/glg6LxXqgs
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

