Arvind Kejriwal | సుప్రీంకోర్టుకు అరవింద్ కేజ్రీవాల్.. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన సీఎం
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కోర్టు ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంత స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థాన్నా ఆశ్రయించారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కోర్టు ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంత స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థాన్నా ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు సోమవారం ఈ అంశంపై విచారణ కోరుతామని తెలిపారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రయల్ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలను చూపడంలో ఈడీ విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
దీంతో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించాలని కోరగా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బెయిల్‌పై మధ్యంతర స్టే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2021-22 సంబంధించిన మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత జూన్ 2న తిరిగి కోర్టులో లొంగిపోయారు. వైద్యపరమైన కారణాలతో ఏడువారాల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరగా.. జూన్ 5న ట్రయల్ కోర్టు తిరస్కరించింది. తాజాగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

