Arvind Kejriwal | అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్టే ఎత్తివేతకు నిరాకరించిన ధర్మాసనం
Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైల్లోనే ఉండాల్సి రానున్నది.
Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైల్లోనే ఉండాల్సి రానున్నది. బెయిల్ పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది. బెయిల్‌పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వు లోపభూయిష్టంగా ఉందని.. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ కోర్టును కోరింది. ఈ నెల 20న రౌస్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ అభ్యర్థన మేరకు కోర్టు స్టే విధించింది.
గతవారం వెకేషన్ జడ్జి జస్టిస్ జూన్ శుక్రవాం ఈడీ పిటిషన్‌ను విచారించారు. స్టే దరఖాస్తుపై తీర్పును రిజర్వ్ చేస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు ఇంప్లీడ్ ఆర్డర్‌పై స్టే ఇచ్చారు. దీంతో మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల ఇచ్చే వరకు వేచి ఉండాలని సూచించింది. రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి బిందు జారీ చేసిన బెయిల్ ఆర్డర్లో ఈడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌పై ఈడీ పక్షపాతంతో వ్యవహరిస్తుందని అభిప్రాయపడ్డారు. నేరం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి ఈడీ ప్రత్యక్ష సాక్షాలను చూపలేదని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

