చండీగఢ్: పార్కింగ్ వివాదం నేపథ్యంలో ఆర్మీ అధికారి, అతడి కుమారుడ్ని పోలీసులు దారుణంగా కొట్టారు. (Army Officer, Son Thrashed By Cops) దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఫిర్యాదుపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. 12 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. పంజాబ్‌లోని పాటియాలాలో ఈ సంఘటన జరిగింది. కల్నల్ పుష్పిందర్ బాత్, ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. మార్చి 13న పాటియాలాలోని ఒక రెస్టారెంట్ వద్ద కారు పార్క్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు.
కాగా, సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు కారును అక్కడి నుంచి తీయాలని కల్నల్ పుష్పిందర్తో దురుసుగా చెప్పారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన పోలీసులు కల్నల్ పుష్పిందర్ను దారుణంగా కొట్టారు. కారు నుంచి బయటకు లాగి కాలితో తన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కల్నల్ కుమారుడిపై కూడా పోలీసులు దాడి చేశారు. బేస్ బాల్ బ్యాట్లతో వారిని కొట్టారు.
మరోవైపు పోలీసుల దాడిలో ఆర్మీ అధికారి కల్నల్ పుష్పిందర్, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. 12 మంది పోలీసులను సస్పెండ్ చేశారు.
కాగా, బాధ్యులైన పోలీసులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. 45 రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుందని చెప్పారు. మరోవైపు కల్నల్, ఆయన కుమారుడ్ని పోలీసులు దారుణంగా కొట్టిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Disgraceful behavior by @PunjabPoliceInd!
A serving Army Colonel was brutally assaulted by Patiala Police officers, yet no proper action has been taken despite CCTV evidence. pic.twitter.com/UIsuXAgm5a— Balbir Singh Sidhu (@BalbirSinghMLA) March 17, 2025