గువాహటి: చైనా ముప్పును ఎదుర్కొనేందుకు సరిహద్దుకు సమీపంలోని అస్సాంలో పినాకా, స్మెర్చ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్స్ (MRLS)ను భారత ఆర్మీ మోహరించింది. పినాక అనేది ఒక స్వయంప్రతిపత్త రాకెట్ ఫిరంగి వ్యవస్థ. సముద్ర మట్టం నుంచి 38 కిమీ ఎత్తు వరకు లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. పినాకాలోని ఆరు లాంచర్ల బ్యాటరీ 44 సెకన్లలో 72 రాకెట్లను ప్రయోగిస్తుంది. తద్వారా 1000 మీటర్ల విస్తీర్ణంలోని లక్ష్యాలను దూరం నుంచే చాలా వేగంగా నాశనం చేస్తుంది.
#WATCH Indian Army displays Pinaka & Smerch multiple rocket launcher systems in Assam pic.twitter.com/6FkiRHbApb
— ANI (@ANI) October 22, 2021