శత్రుదేశాలకు వణుకే.. చైనా-పాక్ సరిహద్దుల్లోకి ‘ప్రళయ్’ మిస్సైల్స్..!
Pralay Missile | చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం 120 ప్రళయ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం రక్షణమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఛేదించే అవకాశం
Pralay Missile | చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం 120 ప్రళయ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం రక్షణమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఛేదించే అవకాశం ఉంది. వీటి నుంచి శత్రువులు తప్పించుకోవడం అసాధ్యం. ఈ క్షిపణులను చైనా, పాక్ సరిహద్దుల్లో మోహరించనున్నారు. మిస్సైల్స్‌ను మొదట వైమానిక దళంలో చేర్చనున్నారు. సమాచారం ప్రకారం.. ఉన్నత స్థాయి సమావేశంలో సాయుధ దళాల కోసం 120 క్షిపణులను కొనుగోలు చేయడానికి, సరిహద్దుల వెంట మోహరించేందుకు ఆమోదించినట్లు సమాచారం.
ఈ బాలిస్టిక్ క్షిపణికి చైనా బాలిస్టిక్ క్షిపణులను పూర్తిగా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించిన క్షిపణిని మరింత అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. 2015 నుంచి మిస్సైల్ సిస్టమ్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్నది. దివంగత ఆర్మీ చీఫ్ స్టాప్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వీటిని ప్రోత్సహించారు. సెమీ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు. ఇంటర్ సెప్టర్ క్షిపణులను తప్పించుకోగల సామర్థ్యం ఉన్నది. శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పూర్తిగా ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది. సూపర్సోనిక్ క్షిపణులతో దీర్ఘ-శ్రేణి వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను రూపొందించడానికి బ్రహ్మోస్ మొబైల్ లాంచర్ నుంచి సైతం ప్రయోగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

