లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీలో కలిసి పోటీచేయాలని అప్నాదళ్ (కమెరావాదీ), ఏఐఎంఐఎం నిర్ణయించాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఆదివారం మీడియా సమావేశంలో ఇరువురు నేతలు పొత్తు గురించి వెల్లడించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, అప్నాదళ్(కే) పొత్తు పెట్టుకోగా, తర్వాత విభేదాలతో దూరమయ్యాయి.