అహ్మదాబాద్: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.500 నోట్లను ముద్రించిన కేటుగాళ్లు.. వాటితో గుజరాత్‌కు చెందిన బంగారం డీలర్ మెహుల్ ఠక్కర్‌ను నిండా ముంచారు. బంగారం కొనుగోళ్ల పేరుతో రూ.1.6 కోట్ల మేర టోకరా వేశారు. ఠక్కర్ ఉద్యోగుల నుంచి బంగారం బిస్కట్లను తీసుకుని ఉడాయించారు. నకిలీ నోట్లపైన ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని రాసి ఉంది. ఈ ఘటన సెప్టెంబర్ 24న జరిగింది. కేటుగాళ్లు రెండు రోజుల క్రితమే హవాలా ఆఫీస్ తెరచి ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.