Dizen | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కడుపులో మంట నివారణకు, ఆహారం అరుగుదలకు వినియోగించే అబాట్ ఇండియా కంపెనీకి చెందిన డైజిన్ అనే యాంటాసిడ్ ఔషధంపై ఫిర్యాదులు రావడంతో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అప్రమత్తమైంది. వెంటనే ఆ కంపెనీకి చెందిన ఔషధాల అమ్మకాలను నిలిపివేసి వెనక్కి రప్పించింది. ఒకే బ్యాచ్‌కు చెందిన రెండు డైజిన్ ఔషధాలు వేర్వేరుగా ఉన్నాయని ఒక వ్యక్తి డీసీజీఐకి ఫిర్యాదు చేశారు.
ఒక బాటిల్ పుదీనా రుచితో తియ్యగా ఉండగా, మరొకటి చేదుగా, ఘాటైన వాసనతో ఉందంటూ పేర్కొన్నాడు. దీనిపై అప్రమత్తమైన డీసీజీఐ సంబంధిత కంపెనీకి లేఖ రాయగా ఆ కంపెనీ స్వచ్ఛందంగా వాటి అమ్మకాలను నిలిపివేసి తమ ఔషధాలను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. బాట్ ఇండియా కంపెనీ గోవా యూనిట్లో తయారైన యాంటాసిడ్ మందులను వాడవద్దని, డాక్టర్లు వాటిని సూచించవద్దని, మందుల షాపుల వారు వాటి అమ్మకాలను నిలిపివేయాలని డీసీజీఐ ఆదేశాలు జారీ చేసింది.