మంగళవారం 19 జనవరి 2021
National - Dec 18, 2020 , 17:07:13

సింహాన్ని ఆటపట్టించిన ఆకతాయి.. వీడియో వైరల్‌

సింహాన్ని ఆటపట్టించిన ఆకతాయి.. వీడియో వైరల్‌

రాజ్‌కోట్‌ : అడవికి రారాజైన సింహాన్ని ఆమడదూరం నుంచి చూసేందుకే వణికిపోతుంటాం. అలాంటింది అతిదగ్గర నుంచి గోడచాటుగా వీడియో తీయడమంటే సాహసమే. కానీ గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లా గాధ తాలూకా డ్రోన్‌ గ్రామంలో ఓ ఆకతాయి వ్యక్తి ఇదే పనిచేశాడు. వ్యవసాయం పొలంలో ఉదయం విశ్రాంతి తీసుకుంటూ సింహం కనిపించడంతో పక్కనే ఉన్న రాతిగోడ వెనుక నుంచి వీడియో తీశాడు. గుర్తించిన సింహం కోపంతో గోడవైపు పరుగు తీయడంతో పారిపోయి తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నది. విషయం అటవీఅధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.