న్యూఢిల్లీ, జూలై 16: భయమంటే ఏమిటో తెలియని వయస్సులో ఒక బుడతడు పాముతో ఆడుకుంటూ చేసిన విన్యాసం ఇంట్లో వారికి చెమటలు పట్టించగా, వ్యూయర్లను బాబోయ్ అనేలా చేసింది. ఒక పిల్లవాడు ఏకంగా పెద్ద పామును చేతిలో పట్టుకుని ఇంట్లోకి రావడం చూసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. నేలపై కూర్చున్నవారు ఒక్కసారిగా పైకి లేచి దూరంగా వెళ్లిపోయారు. అయితే ఒక వ్యక్తి ఆ బాలుడి మరో చేయి పట్టుకుని పాముతో సహా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఇన్స్టాలో షేర్ అయిన ఈ వీడియోకు 1.5 కోట్ల వ్యూస్ వచ్చాయి.