Amit Shah- Rajnath | మళ్లీ అమిత్ షాకే హోం.. రక్షణకు రాజ్‌నాథ్.. అవే శాఖల్లో నిర్మల.. జై శంకర్..!
Amit Shah- Rajnath | ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలోని నలుగురు ప్రధాన నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్ తమ పాత మంత్రిత్వశాఖలనే పొందారు.
Amit Shah- Rajnath | ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలోని నలుగురు ప్రధాన నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్ తమ పాత మంత్రిత్వశాఖలనే పొందారు. అమిత్ షాకు కేంద్ర హోంశాఖ, రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్ కు ఆర్థికం, ఎస్ జై శంకర్ కు విదేశాంగ శాఖ కేటాయించారు. మోదీ 2.0 మంత్రి వర్గంలోనూ వీరు ఇదే శాఖలు నిర్వహించారు.
కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాకు ఆరోగ్యశాఖ అప్పగించారు. మోదీ తొలి విడుత మంత్రివర్గంలోనూ నడ్డా కొంత కాలం ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు విద్యుత్ శాఖ అప్పగించారు.
రోడ్లు, రవాణా శాఖను తిరిగి నితిన్ గడ్కరీకే ప్రధాని మోదీ అప్పగించారు. ధర్మేంద్ర ప్రధాన్ యధావిధిగా విద్యాశాఖలోనే కొనసాగుతారు. గత ప్రభుత్వంలో భూశాస్త్ర వ్యవహారాల మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజును పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు మార్చారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ కు కొత్తగా న్యాయశాఖ అప్పగించారు. అసోం మాజీ సీం సర్బానంద సోనోవాల్ కు నౌకాయన శాఖ దక్కింది. ఆదివారం ప్రధాని మోదీతోపాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

