టొరంటో: కెనడా(Canada)లో ఉన్న సిక్కు వేర్పాటువాదల ఏరివేతకు ప్లాన్ వేసింది భారత హోంశాఖ మంత్రి అమిత్ షా అని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ప్రధాని మోదీకి సన్నిహితుడైన అమిత్ షా .. సిక్కు వేర్పాటువాదులను టార్గెట్ చేసినట్లు ఆ దేశం పేర్కొన్నది. కెనడా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. ఖలిస్తానీల ఏరివేత వెనుక అమిత్ షా పాత్ర లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. సిక్కు వేర్పాటువాదులను షా టార్గెట్ చేసిన విషయాన్ని కెనడా విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ మారిసన్ తొలుత అమెరికాకు చేరవేశారు. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రికకు ఆ సమాచారం ఇచ్చింది తానే అని డేవిడ్ పార్లమెంటరీ ప్యానెల్ భేటీలో తెలిపారు. సిక్కు వేర్పాటువాదుల హత్యకు ప్లాన్ వేసిన వ్యక్తి షానేనా అని ఓ జర్నలిస్టు అడిగారని, అయితే ఆ వ్యక్తికి అవునని తాను సమాధానం ఇచ్చినట్లు మారిసన్ తెలిపారు.