మహమ్మారి కలకలం : కేరళకు కేంద్ర బృందం

న్యూఢిల్లీ : కేరళలో కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో ఆ రాష్ట్రానికి నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు నిపుణుల బృందం సహకరిస్తుంది. కేరళలో పది శాతం పైగా పాజిటివిటీ రేటు నమోదవుతున్న 12 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించవచ్చని భావిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 22,056 తాజా కేసులు వెలుగుచూశాయి.
దేశం మొత్తం నమోదైన కేసుల్లో ఇవి 50 శాతంపైగా ఉండటం గమనార్హం. తాజా కేసులతో కేరళలో ఇప్పటివరకూ 33,27,301 కేసులు వెలుగుచూడగా 16,457 మంది మహమ్మారి బారినపడి మరణించారు. కేరళలో కరోనా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు మరిన్ని వ్యాక్సిన్ డోసులు పంపాలని కేరళలో కొవిడ్‌పై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యుడు డాక్టర్ అనీష్ డిమాండ్ చేశారు. సెరో సర్వే ప్రకారం కేరళలో 42 శాతం మందిలోనే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందినట్టు వెల్లడైందని చెప్పారు. జాతీయ సగటు కంటే కేరళలో అత్యధిక జనాభాకు వ్యాక్సినేషన్ చేపట్టామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

