Assam CM: అస్సాం సీఎం హిమంత శర్మపై మిజోరంలో కేసు నమోదు

కొలసిబ్: అస్సాం ముఖ్యమంత్రి ( Assam CM ) హిమంత బిశ్వ శర్మ ( Himanta Biswa Sharma ) తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురు అధికారులపై మిజోరం ( Mizoram ) రాష్ట్రంలో పోలీసు కేసు నమోదు అయ్యింది. హత్యాయత్నం, దాడి కింద ఆ కేసులను బుక్ చేశారు. ఈశాన్య భారతానికి చెందిన ఆ రెండు రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజుల నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. గత వారం సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే. అస్సాం ఐజీపీ అనురాగ్ అగర్వాల్, డీఐజీ దేవజ్యోత్ ముఖర్జీ, కాచర్ ఎస్సై చంద్రకాంత్, ధోలియా పోలీస్ స్టేషన్ ఇంచార్జీ సాహెబ్ ఉదిన్‌పై మీజోరం పోలీసులు కేసు దాఖలు చేశారు. ఐపీసీలోని 307/120-B/270/325/326 and 353/336/ 334/448/34 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేవారు. నలుగురు పోలీసు, ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు మీజోరం ఐజీ సమన్లు జారీ చేశారు. అస్సాంలోని కచార్ జిల్లాతో సరిహద్దు కలిగి ఉన్న మీజోరంలోని కొలసిబ్ జిల్లాలోని వైరంటేగ్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాల ధరల పెంపుతో స్వీట్ల ధరలకు రెక్కలు
క్యాన్సర్ మందుల తగ్గిన ధరలు అమల్లోకి
దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

