Tirupati Laddoos | నాలుగు రోజుల్లో 14 లక్షల లడ్డూల విక్రయం.. కల్తీ అంశం అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదన్న అధికారులు
Tirupati Laddoos | మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూ (Tirupati Laddoos) తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు (Animal Fat) వినియోగం అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Tirupati Laddoos | మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూ (Tirupati Laddoos) తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు (Animal Fat) వినియోగం అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రజలు ఎంతో ఇష్టంగా తినే తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ వివాదం లడ్డూ విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు తాజాగా స్పష్టం చేశారు. గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం 14 లక్షల లడ్డూలు విక్రయించినట్లు (4 Lakh Tirupati Laddoos Sold In 4 Days) వెల్లడించారు. ఈ నెల 19న మొత్తం 3.59 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 20వ తేదీన 3.17 లక్షలు, సెప్టెంబర్ 21న 3.67 లక్షలు, సెప్టెంబర్ 22న 3.60 లక్షల లడ్డూలు అమ్ముడైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సగటున రోజుకు 3.50 లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయనే వార్తలు ఇటీవల పెద్ద దుమారం రేపాయి. ఈ క్రమంలో జరిగిన మహా పాపానికి పరిహారంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేశామని తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లోనూ ప్రోక్షణ చేస్తున్నామని అన్నారు. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, ప్రోక్షణతో తొలగుతాయని అన్నారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగిపోతాయని చెప్పారు.
Also Read..
TTD Board | త్వరలో టీటీడీకి పాలక మండలి : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
TTD | లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లo వాస్తవం కాదు : టీటీడీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

