DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్‌కు లైసెన్సులు, ఇతర అనుమతులు మంజూరు కోసం వంద కోట్లు లంచం తీసుకున్నట్లు డీఎంకేకు చెందిన మాజీ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళిపై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు చేసిన పోలీసులు, మాజీ పాఠశాల విద్యాశాఖ మంత్రి అయిన ఆయనను అరెస్ట్ చేశారు.
చెన్నై: ప్రైవేట్ స్కూల్స్‌కు లైసెన్సులు, ఇతర అనుమతులు మంజూరు కోసం వంద కోట్లు లంచం తీసుకున్నట్లు డీఎంకేకు చెందిన మాజీ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళిపై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు చేసిన పోలీసులు, మాజీ పాఠశాల విద్యాశాఖ మంత్రి అయిన ఆయనను అరెస్ట్ చేశారు. (DMK Ex-Minister Arrested) ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామన్న హామీతో సుమారు 177 ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి వంద కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు మాజీ మంత్రి అన్బిల్ మహేష్‌పై ఆరోపణలు వచ్చాయి. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఆరోపణలకు సబంధించిన డిజిటల్ పరికరాలు, ఆధారాలు, వాంగ్మూలాలతో సహా పలు సాక్ష్యాలను సేకరించారు.
కాగా, ఈ ఆరోపణలను మాజీ మంత్రి అన్బిల్ మహేష్ ఖండించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, అలాగే ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో డీఎంకేకు చెందిన మాజీ మంత్రి అన్బిల్ మహేష్‌ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే ప్రభుత్వంపై డీఎంకే మండిపడింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

