Hindu Marriage | లక్నో: హిందువుల మధ్య జరిగే పెండ్లికి చట్టబద్ధత రావాలంటే, ఆ వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగి ఉండాలని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తీర్పు చెప్పింది. సంప్రదాయబద్ధంగా పెండ్లి జరగకుండా, కేవలం వివాహ ధ్రువపత్రం మాత్రమే ఉంటే, ఆ వివాహం చెల్లదని స్పష్టం చేసింది. పిటిషనర్ వాదన ప్రకారం, ఆమె, ఆమె తల్లి ఓ మత గురువును అనుసరిస్తున్నారు.
ఆ గురువు ఈ మహిళలిద్దరి చేత తెల్ల కాగితాలపై సంతకాలు చేయించారు. తన సంస్థలో రెగ్యులర్ మెంబర్స్‌గా చేర్చుకోవడానికి ఈ సంతకాలు తీసుకుంటున్నట్లు మాయ మాటలు చెప్పారు. కానీ కొంత కాలం తర్వాత తన తండ్రి వద్దకు ఆ గురువు వెళ్లి, ‘మీ కుమార్తెను నేను ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నాను. వివాహం రిజిస్ట్రేషన్ అయింది’ అని చెప్పారు. దీంతో ఈ వివాహాన్ని రద్దు చేయాలని బాధిత యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది.