All Party Meeting | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : అఖిలపక్ష భేటీ షురూ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానుండగా పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం (All Party Meeting) ప్రారంభమైంది.
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానుండగా పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం (All Party Meeting) ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొనేందుకు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్ధుల్లా, వైకో, తిరుచ్చి ఎన్ శివ, సీపీఎం నేత వి శివదాసన్ తదితరులు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు.
పార్లమెంట్ స్పెషల్ సెషన్ అజెండాపై ఈ భేటీలో చర్చించనున్నారు. పార్లమెంట్ 75 ఏండ్ల ప్రస్ధానంతో పాటు. సాధించిన విజయాలు, అనుభవాలపై తొలి రోజు చర్చ జరగనుందని బుధవారం విడుదల చేసిన పార్లమెంటరీ బులెటిన్ పేర్కొంది. ఇక ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ బిల్లు సహా పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగే ఒక రోజు ముందు నూతన పార్లమెంట్ భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యూసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Read More :
NABARD Recruitment 2023 | నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

