Vijay Sakhare : ఢిల్లీ (Delhi) పేలుడు కేసు (Blast case) ను దర్యాప్తు చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS officer), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్ (Director General) విజయ్ సఖారే (Vijay Sakhare) నేతృత్వంలో స్పెషల్ టీమ్ (Special team) ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IG), ఇద్దరు డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG) లు, ముగ్గురు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) లు, మిగతా ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.
ఈ కేసు విచారణ కోసం ఎన్ఐఏ జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి, ఢిల్లీ పోలీసుల నుంచి, హర్యానా పోలీసుల నుంచి జైష్ ఏ మహ్మద్‌కు సంబంధించిన అన్ని కేసుల డైరీలను సేకరించనుందని అధికారులు తెలిపారు. తద్వారా జైష్ ఏ ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు, ఆర్థికపరంగా ఎవరు సహకరిస్తున్నారనే విషయాన్ని గుర్తించే పనిలో ఉంది. ఉగ్రవాదుల కదలికలను తెలుసుకునేందుకు ఎన్ఐఏ ఇప్పటికే 1000కి పైగా సీసీ ఫుటేజ్‌లను స్కాన్ చేసింది.
అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిటీస్‌ను కూడా పర్యవేక్షిస్తోంది. ఢిల్లీలోని వివిధ ప్రదేశాల నుంచి మొబైల్ డాటాను కూడా సేకరిస్తోంది. కాగా విజయ్ శేఖర్ కేరళ క్యాడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సేవలు అందించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సఖారే ఎన్ఐఏ డీజీగా నియమితులయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా సఖారే ఇవాళ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌తో సమావేశమయ్యారు.