న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన అలస్కా ఎయిర్‌లైన్స్‌కు సోమవారం భారీ ఐటీ ఔటేజ్ సమస్య ఎదురైంది. దీంతో ఈ సంస్థతోపాటు దాని అనుబంధ సంస్థ హొరైజాన్ ఎయిర్‌కు చెందిన వందల విమానాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నెల 20న రాత్రి 8 గంటలకు ఐటీ ఔటేజ్ సమస్య ఎదురైందని అలస్కా ఎయిర్‌లైన్స్ ఎక్స్ పోస్ట్‌లో చెప్పింది.
అలస్కా ఎయిర్‌లైన్స్, హొరైజాన్ ఎయిర్ సంస్థలకు చెందిన విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. రాత్రి 11 గంటలకు వైమానిక సేవలను పునరుద్ధరించినట్లు తెలిపింది. మొత్తం మీద వైమానిక సేవల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరడానికి కాస్త సమయం పడుతుందని వివరించింది.