లక్నో, అక్టోబర్ 1: చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్లో ఉన్నారని, అయితే వారందరికీ పార్టీలో స్థానం కల్పించడం కష్టమని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటూ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అయితే వారికి స్థానం కల్పించే పరిస్థితి పార్టీలో లేదని పేర్కొన్నారు. మేం కేవలం వారికి మాట ఇచ్చి తర్వాత వాటిని తప్పాలని అనుకోవడం లేదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల మాదిరిగానే అదే కూటమి పార్టీలతో కలిసి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీకి దిగుతామని చెప్పారు. త్వరలోనే కూటమి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.