Akhilesh Yadav | ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్యాకేజ్‌ల బడ్జెట్ ప్రవేశపెట్టారు : అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav : ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్ ఆయా రాష్ట్రాలకు బడ్జెట్లో ప్యాకేజ్‌లను వడ్డించిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Akhilesh Yadav : ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్ ఆయా రాష్ట్రాలకు బడ్జెట్లో ప్యాకేజ్‌లను వడ్డించిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ యూపీని ఈ బడ్జెట్ విస్మరించిందని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమంపై బడ్జెట్ ఏమాత్రం దృష్టి సారించలేదని మండిపడ్డారు.
ఏ రాష్ట్రానికి ప్యాకేజ్‌లు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని, కానీ వివక్ష పాటించడం తగదని, యూపీ పట్ల వివక్ష ప్రదర్శించడానికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ, బిహార్‌లకు ప్రత్యేకంగా వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15000 కోట్లు కేటాయించగా, బిహార్‌లో రహదారుల కనెక్టివిటీ కోసం రూ. 26000 కోట్లు కేటాయించారు.
యోగి ఆదిత్యానాథ్ వరదలతో భీతిల్లిన రాష్ట్రానికి సాయం కింద ప్రత్యేక ప్యాకేజ్‌ను డిమాండ్ చేసి ఉండాల్సిందని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం నుంచి రెండింతల లబ్ధి పొందాల్సిన యూపీకి మొండిచేయి చూపారని, యూపీ ప్రజలపై బడ్జెట్లో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని వెల్లడైందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

