UP Polls | యూపీలో 300 స్ధానాలు గెలుచుకుంటాం : అఖిలేష్ యాదవ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే కొద్దిగంటల ముందు రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ కూటమికి 300 స్ధానాలు దక్కుతాయని అఖిలేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే కొద్దిగంటల ముందు రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ కూటమికి 300 స్ధానాలు దక్కుతాయని అఖిలేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తుది విడత పోలింగ్‌లో తూర్పు యూపీలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. అఖిలేష్ సోమవారం ఓ వార్తాచానెల్‌తో మాట్లాడుతూ కాషాయ పార్టీకి ఎన్నికల్లో భంగపాటు తప్పదని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలందరూ అసత్యాలు మాట్లాడారని, ఈ స్ధాయిలో ఏ ఇతర రాజకీయ పార్టీ అసత్యాలు ప్రచారం చేయలేదని ఆరోపించారు. కాషాయ నేతలు నిరుద్యోగం, పేదరికం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం యువత ఐదేండ్లు వేచిచూసిందని, రైతాంగాన్ని ప్రభుత్వం ఎలా వేధించిందో ఎవరూ మరిచిపోరని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెప్పారు.
డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు మండుతున్నాయో, ఎల్పీజీ సిలిండర్ ధర ఎందుకు రూ వేయి పలుకుతుందో బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఐదు ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తామని హామీ ఇవ్వగా అవి ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. యూపీలో మిసైల్స్ తయారీ చేపడతామని కాషాయ పార్టీ నేతలు అసత్యాలు వల్లించారని దుయ్యబట్టారు. యూపీలో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akhilesh Yadav
- BJP
- sp
- UP Polls
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

