లక్నో, జనవరి 8: చాయ్ తీసుకొచ్చి ఇస్తే, అది నిజంగా చాయేనా? అందులో విషం కలిపి ఉంటే? అని పోలీసులను ప్రశ్నించారు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్. బీజేపీపై అవమానకర అభియోగాలు మోపారంటూ ఎస్పీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పరామర్శించేందుకు అఖిలేశ్ ఆదివారం పోలీస్ స్టేషన్కు వచ్చారు.
అక్కడున్న పోలీసులు ఆయనకు చాయ్ ఇవ్వబోగా.. ‘ఇది నిజంగా చాయ్ అని గ్యారంటీ ఏమిటీ.. విషమైతే నా పరిస్థితి ఏమిటి?’ అని పోలీసులను ప్రశ్నించారు. ‘నాకు మీ మీద నమ్మకం లేదు.. నాకు మా కార్యకర్తలు బయటనుంచి చాయ్ తీసుకొస్తారు. అయితే మీ కప్పును మాత్రం వాడుకొంటాను’ అని అఖిలేష్ అనడంతో అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు.