జమ్ము : జమ్ములోని ‘కశ్మీర్ టైమ్స్’ పత్రిక కార్యాలయంలో గురువారం జమ్ముకశ్మీర్ పోలీసుల స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఏకే రైఫిల్స్ కాట్రిడ్జెస్, తుపాకుల తూటాలు, హ్యాండ్ గ్రెనేడ్ల పిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రిక దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నదని పోలీసులు ఆరోపించారు.
దర్యాప్తులో భాగంగా ఈ పత్రికా కార్యాలయంలో కంప్యూటర్లతో సహా అన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. ఇది స్వతంత్ర పాత్రికేయ గొంతు నొక్కే ప్రయత్నమని పత్రిక సంపాదకులు అనురాధ భసిన్ జమ్వాల్, ప్రబోధ్ జమ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.