సంక్షోభానికి ఆ ముగ్గురే కారణం
రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభానికి ముగ్గురు నేతలు కారణమని పేర్కొంటూ వారిపై క్రమశిక్షణా చర్యలకు పార్టీ పరిశీలకుల బృందం అధిష్టానానికి సిఫారసు చేసింది.
- ఇద్దరు మంత్రులు,ఒక ఎమ్మెల్యేపై చర్యలు!
- సోనియాకు రాజస్థాన్ పరిశీలకుల బృందం నివేదిక
న్యూఢిల్లీ/జైపూర్, సెప్టెంబర్ 27: రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభానికి ముగ్గురు నేతలు కారణమని పేర్కొంటూ వారిపై క్రమశిక్షణా చర్యలకు పార్టీ పరిశీలకుల బృందం అధిష్టానానికి సిఫారసు చేసింది. ఈ మేరకు సోనియాగాంధీకి అజయ్‌మాకెన్, మల్లికార్జున ఖర్గే మంగళవారం నివేదిక ఇచ్చారు. ఈ జాబితాలో గెహ్లాట్ మద్దతుదారులైన ఇద్దరు మంత్రులు శాంతి ధరివాల్, మహేశ్జోషితో పాటు ఎమ్మెల్యే ధర్మేంద్ర ఉన్నారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సీఎల్పీ సమావేశానికి సమాంతరంగా ఎమ్మెల్యేల భేటీ నిర్వహించారని నివేదికలో పేర్కొన్నారు. గెహ్లాట్‌కు తెలిసే ఈ భేటీ జరిగిందని తెలిపారు. సోనియాకు గెహ్లాట్ ఫోన్ చేసి ఎమ్మెల్యేల భేటీలో తన ప్రమేయం లేదని తెలిపారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అటు.. గెహ్లాట్ నామినేషన్‌పై సమాచారం లేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. శశిథరూర్ మాత్రం ఈ నెల 30న నామినేషన్ వేస్తారని సమాచారం వచ్చిందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

