Airlines merger | టాటా గ్రూప్‌లోని రెండు ఎయిర్‌లైన్స్ విలీనం.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో కలిసిన ఏఐఎక్స్ కనెక్ట్
Airlines merger | టాటా గ్రూప్ (TATA Group) లోని విమానయాన సంస్థల్లో రెండు విమానయాన సంస్థలు విలీనమయ్యాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) లో ఏఐఎక్స్ కనెక్ట్ (AIX Connect) విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది.
Airlines merger : టాటా గ్రూప్ (TATA Group) లోని విమానయాన సంస్థల్లో రెండు విమానయాన సంస్థలు విలీనమయ్యాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) లో ఏఐఎక్స్ కనెక్ట్ (AIX Connect) విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ – DGCA) ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి ఏఐఎక్స్ కనెక్ట్ కింద నమోదైన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేరుతో నడవనున్నాయి.
విలీన ప్రక్రియ పూర్తికావడంతో విలీనం అనంతర కార్యకలాపాలను పరిశీలిస్తామని డీజీసీఏ తెలిపింది. అదేవిధంగా ఎయిరిండియా – విస్తారా విలీన ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్.. ఈ నాలుగు టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థలే. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌ను, ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం పూర్తయ్యింది.
ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్‌లో రోజువారీగా సుమారు 400 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. విలీన సంస్థలో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక ఎయిరిండియాలో విస్తారా విలీన ప్రక్రియ నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీన ప్రక్రియ దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణ డిమాండ్‌ను కొంత మేర తగ్గించగలదు. విస్తారా-ఎయిరిండియాలో విలీన ప్రక్రియ కూడా పూర్తయితే మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

